ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన సీబీస్ఈ పదో తరగతి పాస్ - Kaapu Lights – Community Platform

ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన సీబీస్ఈ పదో తరగతి పాస్

By PONNURI . RAGHAVENDRA October 30, 2026

2028లో బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వెసులుబాటుపై స్పష్టత

దిల్లీ: వచ్చే విద్యాసంవత్సరం (2027-28)లో పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉన్న ఓ వెసులుబాటుపై సీబీఎస్ఈ గురువారం స్పష్టత ఇచ్చింది. ఐదు సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాల్సిన విద్యార్థులకు అదనంగా 'స్కిల్ పేపర్', ఐచ్ఛి కంగా ఉంటుంది. తప్పనిసరి గ్రూప్- సబ్జెక్టుల్లో భాగ మైన.. గణితం, సైన్స్, సోషల్సైన్స్లలో ఏదైనా ఒకదా నిలో ఫెయిల్ అయ్యి... ఐచ్ఛికాంశం(స్కిల్ పేపర్) లో పాస్ అయితే ఆ విద్యార్థి బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినట్లుగానే పరిగణించనున్నట్లు సీబీఎస్ఈ తెలి పింది. వృత్తి విద్య తప్పనిసరి పాఠ్యాంశంగా కొనసా గుతుంది. దీనిలో భాగంగా బోర్డు నోటిఫై చేసిన 22 స్కిల్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒక దానిని, లేదా కౌశల్ వికాస్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. అయితే 'స్కిల్ పేపర్' ఐచ్చికానికి ఉన్న వెసులుబాటు 'కౌశల్ వికాస్' కు వర్తించదు. ప్రస్తుతం (2026-27 విద్యాసంవత్సరం) 9వ తరగతిలో ఉండి వచ్చేఏడాది పదో తరగతిలోకి ప్రవేశించబోతున్న విద్యార్థులకు ఇవి వర్తిస్తాయని సీబీ ఎస్ఈ వివరించింది. ఇప్పుడు పదో తరగతి చదువు తున్న విద్యార్థులపై దీని ప్రభావం ఉండదంది.

Live
Community Chat
AI Assistant
AI: Hello! How can I help you today?