మైక్రోసాఫ్ట్ నుంచి ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్ళిపోతారా? - Kaapu Lights – Community Platform

మైక్రోసాఫ్ట్ నుంచి ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్ళిపోతారా?

By admin October 27, 2026

 మైక్రోసాఫ్ట్ నుంచి స్వచ్ఛందంగా వెళ్ళిపోతారా?

మంత్రిత్వ శాఖ లేదా కృత్రిమ మేధ (AI) పెట్టుబడుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన కీలక వివరాలు:

• స్వచ్ఛంద నిష్క్రమణ పథకం (Voluntary Exit Offer): మైక్రోసాఫ్ట్ (Microsoft) భారత్ తో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లోని సుమారు 60,000 మంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ

 ఆఫర్‌ను (VEO) ప్రకటించింది.

• భారత్‌లో ఉద్యోగులు: మైక్రోసాఫ్ట్‌కు భారతదేశంలో దాదాపు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

అర్హత: లెవల్ 70 మరియు అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులు (సహాయక/సీనియర్ డైరెక్టర్ స్థాయి వరకు) ఈ ఆఫర్‌కు అర్హులు. విక్రయాలు, మార్కెటింగ్, డేటా సెంటర్స్ వంటి కొన్ని విభాగాల వారికి ఇది వర్తించదు.

పరిహారం (Severance Package): కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాది సర్వీసు కాలానికి ఒక నెల రోజుల బేసిక్ వేతనం పరిహారంగా, ఆరోగ్య బీమా మరియు ట్రాన్సిషన్ సేవలు లభిస్తాయి.

• చివరి తేదీ: భారత్‌లో అర్హులైన ఉద్యోగులు ఈ ఆఫర్‌ను అంగీకరించడానికి డిసెంబర్ 1 వరకు గడువు ఉంది.

ఉద్యోగులకు 'వాలంటరీ ఎగ్జిట్' ఆఫర్

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తగ్గించుకునేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలనుకునే వారి కోసం పరిహారంతో కూడిన 'వాలంటరీ ఎగ్జిట్' (స్వచ్ఛంద నిష్క్రమణ) ఆఫర్ను ప్రకటించింది. భారత్ తోపాటు, అమెరికా, యూకే, కెనడాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. భారత్లో మైక్రోసాప్ట్కు 23 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంత మంది దీనికి అర్హులన్నది స్పష్టత లేదు. కానీ, అంతర్జాతీయంగా 60వేల మంది దీనికి అర్హులని తెలుస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంస్థ ఉద్యోగుల్లో 27%. భారత్లో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ను ఎంపిక చేసుకోవడానికి డిసెంబర్ 1 వరకు గడువు ఉంటుంది. కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాది సర్వీసు కాలానికి ఒక నెల రోజుల మూల వేతనం (బేసిక్) పరిహారంగా లభిస్తుంది. ఉదాహరణకు 10ఏళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి 10నెలల వేతనం లభిస్తుంది. దీనికితోడు ఆరోగ్య బీమా, కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించే విషయంలో సాయానికి వీలుగా ట్రాన్సిషన్ సర్వీసు ఉద్యోగులు పొందొచ్చు.

ఉద్యోగులను తగ్గించుకునేందుకేనా?

మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగు ణంగా సిబ్బంది సంఖ్యను సర్దుబాటు చేసుకు నేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్మన్ వెల్లడించారు. అర్హత కలిగిన ఉద్యోగు లకు పూర్తి వివరాలతో కంపెనీ నుంచి మెయిల్ వస్తుందన్నారు. సంస్థలోని ఉద్యోగులు అందరికీ ఈ ఆఫర్ వర్తించదని.. ఎంపిక చేసిన విభా గాల్లో లెవల్ 70 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకే ఈ కార్యక్రమం పరిమితమని స్పష్టం చేశారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగడం అన్నది కంపెనీకి కొత్త అన్నారు. 

కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్నాలజీ ప్రపంచంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటుండడం, చాలా పనులను ఏఐ మోడళ్లు చేసేస్తుండ డంతో.. మైక్రోసాఫ్ట్ ఈ విధమైన పథకంతో ముందుకు రావడం గమనార్హం. కాగా, ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ ప్రకటించినప్పటికీ.. భారత లో భారీ పెట్టుబడులు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. 2025 నుంచి 2029 వరకు క్లౌడ్, ఏఐ సదుపాయాలపై (ఇన్ ఫ్రా) 20.5 బిలియన్ డాలర్ల (రూ.1.95 లక్షల కోట్లు) పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్టు మైక్రో సాఫ్ట్ అధికార ప్రతినిధి ప్రకటించారు.

Live
Community Chat
AI Assistant
AI: Hello! How can I help you today?